దేవి నవరాత్రులు ఈ రోజు అమ్మవారి అవతారం..
అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.) 5వ రోజు స్కందమాత అమ్మవారు (ఆకుపచ్చ) ఈరోజున స్కందమాతను పూజిస్తారు. ఈమెను శక్తి, మాతృత్వానికి దేవతగా భావిస్తారు. అలాగే.. ఆకుపచ్చ రంగు ప్రకృతి, కొత్త ప్రారంభాలకు సూచిక. అలాగే ఇది అభివృద్ధి, సంతానోత్పత్తి, శాంతి, ప్రశాంతత
/amalapuram-vasavi-ammavari-temple-currency-decoration-video-viral


అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.) 5వ రోజు స్కందమాత అమ్మవారు (ఆకుపచ్చ)

ఈరోజున స్కందమాతను పూజిస్తారు. ఈమెను శక్తి, మాతృత్వానికి దేవతగా భావిస్తారు. అలాగే.. ఆకుపచ్చ రంగు ప్రకృతి, కొత్త ప్రారంభాలకు సూచిక. అలాగే ఇది అభివృద్ధి, సంతానోత్పత్తి, శాంతి, ప్రశాంతతను సూచిస్తుంది. ఈ రోజున ఆకుపచ్చ కలర్‌ దుస్తులు ధరించి స్కందమాత అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

స్కందమాత (సరస్వతి దేవి)

దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది.

స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది.

పురాణ చరిత్ర:

స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ, పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తరువాత, వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా, కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు, ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని, ఇది మంచి, ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది.

ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ, కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా, ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ, రెల్లు పొద(శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ, పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని, అతనిపై యుద్ధం ప్రకటించి, దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.

ఉర్రూతలూగించే డ్యాన్సులు సంగీత ప్రియులను మైమరిపించే పాటలు. చూపురులను ఆకట్టుకునే డ్రోన్‌షోలతో విజయవాడ ఉత్సవ్ ఉత్సాహంగా సాగుతోంది. ఓ వైపు కళాకారుల నృత్య ప్రదర్శనలు, మరోవైపు నోరూరించే ఫుడ్ స్టాల్స్‌ నగరవాసులతో పాటు పర్యాటకులనూ ఆకట్టుకుంటున్నాయి. నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో సాగుతున్న కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. వికసిత్‌ భారత్‌ సాధనలో సంస్కృతులను పరిరక్షించడం ఒక భాగమని ఆ దిశలో ఏపీ సర్కారు పయనించటంపై ఆనందం వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా నగరంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమానికి జనం పోటెత్తుతున్నారు. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వేడుకులు అర్థరాత్రి వరకు చూపురులను అలరించాయి. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు వేడుకలు చూసేందుకు ఆసక్తి చూపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో పండుగ వేళ బంధువుల ఇళ్లకు వచ్చి ఈవెంట్స్ ఆస్వాదిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande