హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్-విజయవాడ జాతీయ
రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మార్గంలో హయత్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పండుగకు వెళ్లే వాహనాలకు తోడు భారీ వర్షాలు తోడవడంతో ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా జిల్లాలకు వెళ్లే బస్సులను దిల్సుఖ్నగర్ వద్ద మళ్లిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..