గుంటూరులో పానీపూరీ బంద్
గుంటూరు, 27 సెప్టెంబర్ (హి.స.): గుంటూరులోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట సహా 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. కమిషనర్ శుక్ర వారం అధికారులతో ప్రత్యేక సమావేశ
గుంటూరులో పానీపూరీ బంద్


గుంటూరు, 27 సెప్టెంబర్ (హి.స.): గుంటూరులోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట సహా 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు.

కమిషనర్ శుక్ర వారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై జాగ్రత్తలు సూచించారు. వ్యాధి మరింత ప్రబలకుండా తక్షణ చర్యగా నగరంలో టిఫిన్ బండ్లు, పానీపూరీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు పులి శ్రీనివాసులు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande