తిరుమలలో.గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి నుంచి.తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు
తిరుమల, 28 సెప్టెంబర్ (హి.స.) తిరుమలలో గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికో బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తిరుపతి- తిరుమల మధ్య 425 బస్సు సర్వీసులు నడవనున్నాయి. మామ
తిరుమలలో.గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి నుంచి.తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు


తిరుమల, 28 సెప్టెంబర్ (హి.స.)

తిరుమలలో గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికో బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తిరుపతి- తిరుమల మధ్య 425 బస్సు సర్వీసులు నడవనున్నాయి. మామిడి కాయల మార్కెట్, చెర్లోపల్లి సమీపంలోని హైవే, దేవలోక్, SVCE కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ తదితర ప్రాంతాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికి ఒక బస్సు చొప్పున 3,125 ట్రిప్పులతో దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు ప్రయాణించేలా అధికారులు సన్నాహాలు సిద్ధం చేశారు.

అయితే, తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలకు వెళ్ళే భక్తుల కోసం తిరుపతిలో 10 చోట్లా బస్సులు, కార్లు, టూ వీలర్లకు పార్కింగ్ ‌‌ సౌకర్యం కల్పించారు. ఇస్కాన్ టెంపుల్, నెహ్రూ మున్సిపల్ హైస్కూలు, భారతీయ విద్యా భవన్ గ్రౌండ్, దేవలోక్, చెర్లోపల్లి, వకుళమాత ఆలయాల దగ్గర పార్కింగ్, మ్యాంగో మార్కెట్ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇక, అలిపిరి నుంచి తిరుమలకు సుమారు నాలుగు వేల వాహనాల వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande