ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని
ఎన్కౌంటర్


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో

ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సీనియర్ పోలీస్

అధికారి వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహించేందుకు

బయల్దేరారని, ఈ క్రమంలో కాల్పులు జరిగాయని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను

స్వాధీనం చేసుకున్నామని, కాంకేర్, గరియాబంద్ నుంచి రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్

గార్డ్ (DRG)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande