పదేళ్లు నాకు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ కి పోటీగా తయారు చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నేడు తొలి పునాది రాయి వేసిన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విజయదశమి మనకు అన్ని విజయాలను చేకూరుస్తుందని.. చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రేవంత్కు భూములు ఉన్నాయని, న
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నేడు తొలి పునాది రాయి వేసిన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విజయదశమి మనకు అన్ని విజయాలను చేకూరుస్తుందని.. చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రేవంత్కు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. నాకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయి.. దాచిపెడితే దాగవు.. కుతుబ్ షాహీలు నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని కొనసాగించారు. ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టే.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నాం. వారు మాకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని సీఎం అన్నారు.

అలాగే నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్, దుబాయ్స్తో పోటీ పడేలా చేస్తా.. న్యూయార్క్ ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా.. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదు?.. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం.. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించాం..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande