తగ్గిన క్రైం రేటు...సిటీ పోలీసీంగ క్కు నిదర్శనం. సీవీ ఆనంద్
హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ను క్రైం ఫ్రీ సిటీ తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రతి ఒకరు సమన్వయంతో చేసిన కృషితో నగరంలో క్రైం రేటు భారీగా తగ్గిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, డీజీపీ సీవీ ఆనంద్ అన్నార
డిజిపి ఆనంద్


హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ను క్రైం ఫ్రీ సిటీ

తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రతి ఒకరు సమన్వయంతో చేసిన కృషితో నగరంలో క్రైం రేటు భారీగా తగ్గిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రజల సహాకారం ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం సీవీ ఆనంద్ను హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేయడంతో సీవీ ఆనంద్ ఆదివారం క్రైం రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 అగస్టు నుంచి 2025 సెప్టెంబరు వరకు నగరంలో ఉన్న క్రైం రేటు వివరాలను ఆదివారం విడుదల చేశారు. దీంతో పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒకరు నిబద్ధతతో పని చేయడంతో నగరంలో శాంతి భద్రతలకు ఏలాంటి విఘాతం కలగకుండా ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించగలిగామన్నారు. ఇందుకు సహాకరించిన ప్రతి ఒక అధికారికి సీపీ సీవీ ఆనంద్ క్రుతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా అందరూ కలిసి పని చేస్తు హైదరాబాద్ ప్రతిష్ఠ తో పాటు సిటీ పోలీసీంగ్ కీర్తి ని చాటాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande