జూరాలకు పోటెత్తిన వరద.. 39 క్రెస్టు గేట్లు ఎత్తివేత
జోగులాంబ గద్వాల, 28 సెప్టెంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా,
జూరాల ప్రాజెక్టు


జోగులాంబ గద్వాల, 28 సెప్టెంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.370 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 7.407 టీఎంసీల నీరు ఉంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande