తెలంగాణ, సూర్యాపేట. 28 సెప్టెంబర్ (హి.స.)
22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదని, అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండని, రైతు రుణమాఫీ డిసెంబర్ 9 లోపే చేస్తామని చెప్పి, హామీలే కాదు ఇంటింటికి గ్యారెంటీ కార్డు కూడా స్వయంగా వాళ్లే పంచిండ్రని తెలియజేశారు. గ్యారెంటీ కార్డులను దగ్గర పెట్టుకొని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు