తెలంగాణ, నిజామాబాద్. 28 సెప్టెంబర్ (హి.స.)
భారీ వర్షాలు వరదల నేపథ్యంలో
మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు అప్రమతమై నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హంగర్గ గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ మంజీరా పరివాహక ప్రాంతాల గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తుంది.ఈ రోజు తెల్లవారుజామున గ్రామంలోకి 8 అడుగుల వరకు వరద నీరు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.గత నెల రోజుల నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు సూచనలు చేస్తున్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదు. అకస్మాత్తుగా వరద ఉధృతి రావడంతో హుటాహుటిన అధికారులు బస్సులలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తహాసిల్దార్ విట్టల్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు