హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
కొత్త యుగానికి కొత్త బాటలు వేయాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రణాళికబద్ధమైన నగరం కోసం ఇవాళ ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాళ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన, రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన శ్రీధర్ బాబు. ఈ దేశంలో ప్రణాళికబద్దమైన నగరం ఛండీఘర్. దాని కంటే 10 రెట్లు మెరుగైన రీతిలో ఉండేలా సీఎం ప్రణాళిక చేశారన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ స్పోర్ట్స్, ఐటీ, ఇండస్ట్రీ జోన్ గా ఉండేలా ప్రణాళిక బద్ధంగా ప్రపంచ స్థాయి నగరం నిర్మించబోతున్నామన్నారు. గత ప్రభుత్వాలు మన నగర రూపురేఖలు మారుస్తామని మాటలు చెప్పి పోయాయి. కానీ భవిష్యత్ లో న్యూయార్క్, లండన్ తో పాటు విదేశాల్లో ఉంటున్నవాపు తమ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ తరహాలో ఉండాలి అనుకునేలా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..