బీసీ రిజర్వేషన్తో ఎవరికీ నష్టం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ, మిర్యాలగూడ. 28 సెప్టెంబర్ (హి.స.) అన్ని రాజకీయ పార్టీల మద్దతు ద్వారానే బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 42 శాతం బీసీ రిజర్వేషన్తో ఎవరికి నష్టం జరగదని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ ప
మంత్రి పొన్నం


తెలంగాణ, మిర్యాలగూడ. 28 సెప్టెంబర్ (హి.స.)

అన్ని రాజకీయ పార్టీల మద్దతు

ద్వారానే బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 42 శాతం బీసీ రిజర్వేషన్తో ఎవరికి నష్టం జరగదని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా కుల సేకరణ చేసి రాహుల్ గాంధీ చేపట్టిన ఎవరు ఎంతో వారికి అంత నినాదం పేరుతో బీసీ రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందుకు అన్ని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల మద్దతు ద్వారా రిజర్వేషన్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. పెరిగిన బీసీ రిజర్వేషన్ల వల్ల ఎస్ టి, ఎస్సీ, ఈ బీసీ లకు ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande