తెలంగాణ. 28 సెప్టెంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో తిరుగుతూ తాళం వేసిన ఇంటికి కన్నం వేసి, దోచుకున్న డబ్బులతో జల్సాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులు గత ఐదు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో ఠాణా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాళం వేసిన ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఇటీవల వివిధ దొంగతనాల నేపథ్యంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దోపిడీకి పాల్పడిన ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు