తెలంగాణ, 28 సెప్టెంబర్ (హి.స.)
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే
ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పనుల్లో నిమగ్నమై ఉండడంతో రేపు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, దూర ప్రాంతాల నుండి వచ్చి ఇబ్బందులు పడకుండా సహకరించాలని కలెక్టర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు