అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి, సెప్టెంబర్ 28 : కృష్ణానది వరద ప్రవాహం ఇవాళ మరింత పెరిగింది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీకాగా, ఇవాళ విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజి ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
దుర్గమ్మ శరన్నవరాత్రులకు విజయవాడ వచ్చే భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. హెచ్చరిక సూచనలు, జాగ్రత్తలు భక్తులు తప్పక పాటించాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ