హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది.
ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను అప్రమత్తం చేసిన అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..