హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో గ్రూప్-2 తుది
ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. గ్రూప్ 2లో మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది టీజీపీఎస్సీ. ఒక వెకెన్సీని విత్ హెల్డ్లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..