వనదుర్గ ఆలయం వద్ద భారీ వరద.. కొట్టుకుపోయిన గర్భగుడి షెడ్డు..
తెలంగాణ, మెదక్. 28 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని చారిత్రక ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మంజీరా నదికి పోటె
వనదుర్గ


తెలంగాణ, మెదక్. 28 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని చారిత్రక ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

మంజీరా నదికి పోటెత్తిన భారీ వరద కారణంగా ఆలయ ప్రాంతం జలమయమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో ఏడుపాయల ఆలయం గత 15 రోజులుగా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఏకంగా ఒక లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నదికి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది.

వరద ప్రవాహం తీవ్రతకు ఆలయ ప్రాంగణంలో ఉన్న నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గర్భగుడి మండపం పైభాగంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. అంతేకాకుండా ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు కూడా నది ప్రవాహానికి ధ్వంసమై కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande