రూ. లక్షా 15 వేలు దాటేసిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
ముంబై, 29 సెప్టెంబర్ (హి.స.)పండగల సీజన్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. గత రెండు రోజుల్లో తులంపై సుమారు రూ.1500కుపైగా పెరిగిన బంగారం ధర.. తాజాగా పది రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ తగ్గింపు పెద్దగా
Gold


ముంబై, 29 సెప్టెంబర్ (హి.స.)పండగల సీజన్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. గత రెండు రోజుల్లో తులంపై సుమారు రూ.1500కుపైగా పెరిగిన బంగారం ధర.. తాజాగా పది రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ తగ్గింపు పెద్దగా ఊరటనిచ్చేది కాదు. సెప్టెంబర్‌ 29వ తేదీన తులం ధర రూ.1,15,470 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,990 ఉంది.

ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,840 ఉంది.

I

హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,840 ఉంది.

ఇక వెండి ధర విషయానికొస్తే ఇది భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. రూ.1లక్షా 49,000, హైదరాబాద్‌, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.1,58,900 వద్ద కొనసాగుతోంది. గతంలో పెద్దగా పెరిగేది కాదు. కానీ ఈ మధ్య కాలం నుంచి వెండి ధర పరుగులు పెడుతోంది.

భారతదేశంలో బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు?

భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande