విజయవాడ 29 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో( )దసరా ఉత్సవాలుఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ(సోమవారం) సరస్వతిదేవి అలంకారంలో దుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గమ్మను తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో కేశినేని శివనాథ్ మాట్లాడారు. మూలా నక్షత్రం రోజైన నేడు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ