/దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.)భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు (PM Modi-Giorgia Meloni). అంతర్జాతీయ వేదికలపై వారిద్దరూ కలుసుకొన్నప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటుంటారు. ఈ స్నేహంతో మెలోనీ పుస్తకానికి మోదీ ముందుమాట రాశారు.
‘I Am Giorgia — My Roots, My Principles’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్‌కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం కాలంతో సంబంధం లేని సత్యాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుంది’’ అని రాసుకొచ్చారు. సాంస్కృతిక వారసత్వం, సమానత్వంపై ఆమెకు అమితమైన విశ్వాసం ఉందని కొనియాడారు. ఎన్నో అంశాల్లో ఇరుదేశాల మధ్య సారుప్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ