మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రసక్తే లేదు.. కావాలంటే లొంగిపోండి
దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.) కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వ
Amit Shah


దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు. “ఇప్పటివరకు జరిగింది పొరపాటు అని, వారు లొంగిపోవాలనుకుంటున్నందున కాల్పుల విరమణ కోరుతూ ఒక లేఖ సర్క్యులేట్ అవుతోంది. కాల్పుల విరమణ ఉండదు. వారు లొంగిపోవాలనుకుంటే, కాల్పుల విరమణ అవసరం లేదు – మీ ఆయుధాలను వదిలిపెట్టండి. పోలీసులు ఒక్క తూటా కూడా కాల్చరు,’’ అని అమిత్ షా అన్నారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని అమిత్ షా మరోసారి ప్రకటించారు. సాయుధ కార్యకలాపాలను అంతం చేయడం వల్లే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande