విశాఖపట్నం 29 సెప్టెంబర్ (హి.స.) దసరా పండుగ సమయంలో ఉత్తర కోస్తా ప్రాంతంలో ముసురు వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ నెల 30న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దీని ప్రభావంతో 1న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2న రాత్రి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని విశ్లేషించారు. 1న కోస్తాలో.. ప్రధానంగా ఉత్తరకోస్తాలో వర్షాలు పడతాయని, 2న వర్షాలు పెరుగుతాయని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ