విజయవాడ, 29 సెప్టెంబర్ (హి.స.)విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. నేడు మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం రాత్రి నుంచే దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తుండగా.. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొండ కింది వరకూ ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో నిండిపోగా.. వినాయక గుడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి