తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకూ క్యూలైన్
తిరుమల, 29 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులు కావడంతో పిల్లలతో కలిసి కొండకు వస్తున్న సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం క్యూ లైన్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. సర్
తిరుమల


తిరుమల, 29 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులు కావడంతో పిల్లలతో కలిసి కొండకు వస్తున్న సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం క్యూ లైన్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్లోకి వెళ్లి కంపార్టుమెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి స్వామి వారిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. కొత్తగా క్యూలైన్లలోకి వెళ్లేవారికి 20-24 గంటల సమయం పడుతుందని పేర్కొంది.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఆదివారం స్వామివారిని 79,496 మంది భక్తులు దర్శించుకోగా.. 29,591 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్వామివారి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై.. గరుడవాహనం పై తిరుమాఢ వీధుల్లో ఊరేగగా.. రెండు లక్షలకు పైగా భక్తులు ఆయన్ను కన్నులారా దర్శించుకున్నారు. అడుగడుగునా హారతులద్దగా గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande