దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.)విజయాల సంబరాల్లో మునిగి అందరూ క్రికెటర్లను ప్రశంసిస్తున్నారే తప్ప.. ఎవరూ తెర వెనక కృషిని పట్టించుకోవట్లేదని విచారం వ్యక్తంచేశారు. తరచూ జట్టు కోసం నిందలు పడే కోచ్ గంభీర్ (Gambhir), టీమ్‌ను ఎంపిక చేసిన సెలక్టర్ల (Selectors)ను అభినందించాలన్నారు. జట్టు తప్పు చేస్తే ఎప్పుడూ వారే నిందలు పడతారని.. అదే టీం విజయం సాధించినప్పుడు మాత్రం ఎవరూ వారిని పట్టించుకోరని పేర్కొన్నారు. ఈసారి అన్నీ పక్కాగా చేసినందుకు కోచ్‌ను, సెలక్టర్లను అభినందిద్దాం అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
పాకిస్థాన్ (India vs Pakistan)పై అదిరే విజయం సాధించి భారత్ (Team India) ఆసియా కప్ విజేత (Asia Cup Title)గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమదైన శైలిలో విజృంభించి పాక్‌కు చెమటలు పట్టించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ