ముంబయి,29,సెప్టెంబర్ (హి.స.) గత శుక్రవారం ముగింపు (80, 426)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత మళ్లీ కిందకు దిగజారింది. ప్రస్తుతం ఉదయం 11:30 గంటల సమయంలో సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 80, 449 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 13 పాయింట్ల లాభంతో 24, 668 వద్ద కొనసాగుతోంది
సెన్సెక్స్‌లో సమ్మన్ క్యాపిటల్, బీపీసీఎల్, బీఎస్‌ఈ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రో, ఐనాక్స్ విండ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). డిక్సన్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, కేన్స్ టెక్నాలజీస్, మాజగాన్ డాక్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 63 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.74గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ