పట్నా:/దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.) దేశంలో ప్రజలు వేర్వేరు భాషలు మాట్లాడుతున్నా వారందరినీ ఐక్యంగా ఉంచుతున్న ఘనత ధర్మానిదేనని ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సాహిత్య అకాడమీల సహకారంతో పట్నాలో నిర్వహిస్తున్న ‘ఉన్మేషా అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం’ ముగింపును పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఉమ్మడి భాష లేకుండా భారత్ ఇంత ఐక్యంగా ఎలా ఉందని ఓసారి ఐరోపా ప్రతినిధి ఒకరు నన్ను ప్రశ్నించారు. మన దేశ భాషలు వేరైనా ధర్మ భావన ఒక్కటేనని చెప్పాను. ప్రజాస్వామ్యం అంటే పాశ్చాత్య దేశాల్లో పురుడుపోసుకుందని కొందరు చెబుతారు. కానీ 2,500 ఏళ్ల క్రితమే బిహార్‌లో ఈ ప్రాంతం శక్తిమంతమైన మౌర్య సామ్రాజ్యాన్ని చూసింది. ప్రాచీన గణతంత్రమైన వైశాలీకి జన్మస్థానమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ