నిజామాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB)బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పై దాడి చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చారి.. ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వద్ద నుండి రూ.7 వేలు లంచం తీసుకోవడంతో అప్పటికే అక్కడ మాట వేసి ఉన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అయితే ఏసీబీకి పట్టుబడిన సదరు ఆర్ ఐ శ్రీనివాసచారి గతంలో బోధన్ మున్సిపల్ లో విధులు నిర్వహించే సమయంలో సైతం ఏసీబీకి పట్టుబడినట్లు సహా ఉద్యోగుల ద్వారా తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు