హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.) పార్టీ నుండి సస్పెండ్ చేసిన అనంతరం
మాజీ ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ మరో షాక్ ఇచ్చింది. కవిత అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి నుండి భారీగా కార్యకర్తలను, నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన 300 మంది జాగృతి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
స్వయంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణపై జాగృతి నేతలు, కార్యకర్తలు మరియు మేధావులతో సమావేశం తరవాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్కు నష్టం జరిగే పని తాను ఎప్పుడూ చేయనని అన్నారు. ఈ క్రమంలో జాగృతి నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు