అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)
:ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ .జవహర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్‌కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా క్యాబినెట్ హోదాలోనే ప్రొటోకాల్ అమలు చేయనున్నారు. అదే హోదాలో వేతనాలు, అలవెన్సులు అందించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ