తెలంగాణ, సంగారెడ్డి. 3 సెప్టెంబర్ (హి.స.)
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్జిలోని నిర్మల పాలి క్లినిక్ తో పాటు మరో ప్రైవేట్ హాస్పిటల్ను జిల్లా వైద్య అధికారి నాగ నిర్మల బుధవారం సీజ్ చేశారు. కంగ్జిలోని పలు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆమె, నిర్మల హాస్పిటల్లో బిఏఎంఎస్ వైద్యుడు అనుమతులు లేకుండా ఆలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారని గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడటాన్ని సహించం.. అర్హతలేని వారు, అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడపడం తీవ్రమైన నేరం. నిర్మల పాలి క్లినిక్ కి పర్మిషన్ లేదు. కానీ బిఏఎంఎస్ వైద్యుడు ఆలోపతి ప్రాక్టీస్ చేస్తున్నాడు.అందువల్ల హాస్పిటల్ను సీజ్ చేయక తప్పలేదు అన్నారు. వైద్య రంగంలో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు