అదంతా అవాస్తవం.. గూగుల్ క్లారిటీ..
హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు రిస్క్ ఉందని, వారంతా తక్షణమే తమ పాస్ వర్డులను మార్చుకోవాలని గూగుల్ హెచ్చరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా గూగుల్ స్పందించింది. తాము ఎమర్జెన్సీ వార్నింగ్ ఇ
గూగుల్


హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు రిస్క్ ఉందని, వారంతా తక్షణమే తమ పాస్ వర్డులను మార్చుకోవాలని గూగుల్ హెచ్చరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా గూగుల్ స్పందించింది. తాము ఎమర్జెన్సీ వార్నింగ్ ఇచ్చినట్లు వచ్చిన వార్తులు అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన గూగుల్ అలాంటి భద్రతా హెచ్చరికలు ఏమీ చేయలేదని తెలిపింది. జీమెయిల్ కు బలమైన రక్షణ ఉందని మా వినియోగదారులకు హామీ ఇస్తున్నామని పేర్కొంది. ఇటీవల వినియోగదారులను తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్ అయ్యాయి. జీమెయిల్ లో భద్రతా పరమైన లోపాలు జరిగాయని ఆ విషయంలో మేము యూజర్లకు హెచ్చరికలు పపించామని ఆ ప్రచారం జరుగుతోంది. కానీ అవన్నీ కూడా తప్పుడు ప్రచారం అని గూగుల్ తన బ్లాగ్ లో వెల్లడించింది. తమ వేదికలోకి చొరబడేందుకు హ్యాకర్లు ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా తమ రక్షణ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande