హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను శిరసావహిస్తా.. అని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ వివరణ కోరలేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. కవిత మీడియాతో మాట్లాడుతూ... 'నేను ఏ పార్టీలో చేరను. ఏ పార్టీతోనూ నాకు అవసరం లేదు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. నాన్న (కేసీఆర్) ఇప్పుడు కూడా కొంత ఒత్తిడిలో ఉన్నారు. నాన్న తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తా?. నన్ను ఏ రోజు పార్టీ వివరణ కోరలేదు' అని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..