బి ఆర్ ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత
హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.) ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను మండలి చైర్మన్కు పంపించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా చేశారు. బీఆర్ఎస్
కవిత రాజీనామా


హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)

ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను మండలి చైర్మన్కు పంపించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ క్రమశిక్షణ వ్యవహరాల బాధ్యులు సోమ భరత్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ రావు మంగళవారం నాడు వెల్లడించారు. సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande