హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్పల్లిలో నేడు మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు. ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశ వ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్కు ముఖ్యం. తన కుమార్తె, కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీబీఐ మాత్రమే కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు. సీబీఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..