చతిస్గడ్ , 3 సెప్టెంబర్ (హి.స.)
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని ఎస్ పీ
మరియు సి ఆర్ పి ఎఫ్ అధికారుల ఎదుట బుధవారం 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై 33 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు