వికారాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
ఆధునిక సాంకేతికతను యువత
సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇంచార్జి తిరుపతి రెడ్డి తో కలిసి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4000 కోట్ల రూపాయలతో ఏటీసీ, ఐటిఐ లను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.7 కోట్ల 20 లక్షల వ్యయంతో హాకీంపేటలో చేపట్టే ఆధునాతన సాంకేతిక కేంద్రం ద్వారా యువత భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుందని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు