హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
కల్వకుంట్ల కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని చాలా కాలంగా తాము చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె చెప్పారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్ కు చెప్పానని అయినా ఆ రోజు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకటే ఫ్లైట్ లో వచ్చారనే విషయం వాళ్లిద్దరు కుమ్మక్కై మెదక్ లో నన్ను ఓడించాలని చూస్తున్నారనే విషయాన్ని 22 మార్చి 2024 లోనే తాను మీడియా ముందుకు వచ్చి చెప్పానన్నారు. 20 మార్చి 2024 ఏయిరిండిలా విమానంలోని బిజినెస్ క్లాస్ లో రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కలిసి ట్రావెల్ చేశారని నన్ను ఓడించేందుకు ఇవాళ చర్చించుకున్నారన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవినీతిని పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కవిత మాటలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా అవినీతి పునాదుల అర్థమవుతోందన్నారు. మీద విస్తరిచబడిందనేది
కేసీఆర్ క్లబ్ లు బంద్ చేస్తే మీరు పబ్బులు నడిపిన విషయం అందరికి తెలిసిందే 'టానిక్' అంశం చిన్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని రూ. 750 కోట్లతో ఎమ్మెల్సీ పోచంపల్లి విల్లా కడుతుంటే, మరో ఎమ్మెల్సీ నవీన్ రావు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కవిత ఇంకా మాట్లాడాలని రాబోయే ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ పెద్దలు చేసిన అవినీతిని కవిత బయటపెడితే బాగుoటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..