జోగులాంబ గద్వాల, 3 సెప్టెంబర్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవ్వడం గ్రామంలో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే తాటికుంట గ్రామానికి చెందిన రాముడు (40)-సంధ్య(35) భార్యభర్తలు. వీరిద్దరూ మంగళవారం సాయంత్రం తాటికుంట రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లారు. దంపతులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఎంత వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి. బుధవారం మధ్యాహ్నం వరకు కూడా దంపతుల ఆచూకీ దొరకలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు