రాయదుర్గంలో ఎకరాకు రూ.101 కోట్లు.. అమ్మకానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర ఖజానాను నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన భూముల వేలానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ పచ్చజెండా ఊపగా.. టీజీఐఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే గత ప్రభుత్వం శేరిల
భూముల వేలం


హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్ర ఖజానాను నింపేందుకు

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన భూముల వేలానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ పచ్చజెండా ఊపగా.. టీజీఐఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే గత ప్రభుత్వం శేరిలింగంపల్లి మండల పరిధిలోని మాదాపూర్ లోని విలువైన భూములను అమ్మగా.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని విలువైన భూముల అమ్మకానికి సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్ మక్త గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 83/1లోని మొత్తం 18.67 ఎకరాలను వేలం వేసేందుకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ భూమిని ఎకరాకు రూ.101 కోట్లు చొప్పున విక్రయించనున్నట్టు టీజీఐఐసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల అమ్మకాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ విలువైన భూములను అమ్మాలని నిర్ణయించడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande