తూర్పు.గోదావరి.జిల్లా కృష్ణం పాలెం జాతీయ రహదారి పై రోడ్డు.ప్రమాదం.జరిగింది
అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.) దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా కృష్ణంపాలెం జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. లారీని కంటెయినర్ ఢీకొని వెనక్కి వస్తుండగా అదే సమయంలో డ్యాన్సర్లతో వెళ్తున్న టాటా మ
తూర్పు.గోదావరి.జిల్లా కృష్ణం పాలెం జాతీయ రహదారి పై రోడ్డు.ప్రమాదం.జరిగింది


అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)

దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా కృష్ణంపాలెం జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. లారీని కంటెయినర్ ఢీకొని వెనక్కి వస్తుండగా అదే సమయంలో డ్యాన్సర్లతో వెళ్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం దాన్ని ఢీకొట్టింది. దీంతో టాటా మ్యాజిక్‌ డ్రైవర్‌ నాని (28) మృతిచెందగా.. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు డ్యాన్సర్లు స్వల్పంగా గాయపడ్డారు. నెల్లూరులో ప్రోగ్రాం కోసం విశాఖపట్నం నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో 8 మంది డ్సాన్సర్లు ఉన్నారు. డ్రైవర్‌ నాని మృతదేహాన్ని గోపాలపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరం. అతడు కూడా డ్యాన్సర్‌. రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉండగా మృత్యువాత పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande