అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)
తిరుపతి: దసరా, దీపావళి( సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి) నుంచి సాయినగర్ షిరిడీ, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లు అక్టోబరు 5 నుంచి నవంబరు 24 వరకు నడుస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ