హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
లంబాడీలకు రిజర్వేషన్ హక్కు
తొలగించాలని సుప్రీంకోర్టులో తెల్ల వెంకటరావు, బాబురావులు పిటిషన్ వేసినందుకు నిరసనగా.. లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సమితి ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. వెంటనే అక్కడికి వెళ్లిన ఎల్ బి నగర్ పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను లాక్కున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కుట్రల వెనుక మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిలు ఉన్నారని, వారికి లంబాడీల సత్తా ఏమిటో రుచి చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం వెంకట్ రావు, బాబు రావు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..