అమరావతి, /న్యూఢిల్లీ,3 సెప్టెంబర్ (హి.స.)
:జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇసుక తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు ఎన్జీటి విధించిన రూ. 18 కోట్ల జరిమానాను రెండు వారాల్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే జేపీ వెంచర్స్‌పై ఎన్జీటి విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను సుప్రీంకోర్టు తొలగించింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలపై న్యాయపోరాటం చేస్తున్న దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఈ సంద్భంగా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ