తిరుమలలో భక్తులకు మోసం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీటీడీ
తిరుమల, 3 సెప్టెంబర్ (హి.స.)శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల(Devotees)ను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ అధికారులు(TTd Office) హెచ్చరించారు. భక్తురాలు ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam)
తిరుమల


తిరుమల, 3 సెప్టెంబర్ (హి.స.)శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల(Devotees)ను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ అధికారులు(TTd Office) హెచ్చరించారు. భక్తురాలు ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) స్పందించారు. ఇటీవల టీటీడీ సేవల పేరుతో నకిలీ వెబ్ సైట్లు ద్వారా మోసం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమాస్పద వ్యక్తులు, దళారులు ప్రలోభ పెడితే ముందుగా 0877 – 2263828కు ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. నకిలీ దర్శన టికెట్లు, వసతి పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

కాగా భక్తురాలు ఊర్వశి.. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్‌లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322ను సంప్రదించారు. ఆ తర్వాత అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్‌లో రిసెప్షన్‌కి చెందిన వాడినని పరిచయం చేసుకున్నారు. సదరు భక్తురాలికి వసతి కల్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. డబ్బు చెల్లిస్తే వసతి టికెట్‌ను పీడీఎఫ్ పంపిస్తామని చెప్పారు. డబ్బు తీసుకున్న తర్వాత సదరు నిందితుడు తన ఫోన్ కాల్స్ , వాట్సాప్ మేసేజ్‌లకు స్పందించకుండా మోసం చేశారు. దీంతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసపోయానని గ్రహించిన సదరు భక్తురాలు 1930 క్రైమ్ హెల్ప్ లైన్‌కు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande