హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స)
వినాయకుల నిమజ్జనం వేళ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. హుస్సేన్ సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్, చార్మినార్ డివిజినల్ పరిధిలోని బర్కత్పురా, ముషీరాబాద్, ఫలక్నూమా, కాచిగూడ, మెహదీపట్నం, రాజేంద్రనగర్ డిపోలు, హయత్ నగర్ పరిధిలోని దిల్సుఖ్నగర్, హయత్నగర్-1, 2, మిథాని డిపోల నుంచి నిమజ్జనం కోసం బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ నగర రీజియన్ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) సుధా పరిమళ తెలిపారు. కాచిగూడ, రాంనగర్ నుంచి బషీర్బాగ్ వరకు, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిథాని నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్రనగర్ నుంచి లక్షీకాపూల్, పటాన్చెరు నుంచి లింగంపల్లి, ఆఫ్టల్గంజ్ నుంచి ఆలిండియా రేడియో వరకు బస్సుల రాకపోకలు సాగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..