మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె.. కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్
బెంగళూరు, 3 సెప్టెంబర్ (హి.స.)వీఐపీల ప్రయాణం కోసం ఓ హెలికాప్టర్, మరో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, త్వరలో టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ
కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్


బెంగళూరు, 3 సెప్టెంబర్ (హి.స.)వీఐపీల ప్రయాణం కోసం ఓ హెలికాప్టర్, మరో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, త్వరలో టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ కొనుగోలు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు, మరికొందరు మంత్రులకు అప్పగించారని ఆయన వివరించారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలపై తాము అధ్యయనం చేసి ముందుకువెళతామని తెలిపారు.

అయితే, ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓవైపు నిధులు లేక రాష్ట్రంలో అభివృద్ధి పనులు కుంటుపడగా.. మరోవైపు ప్రభుత్వ పెద్దలకు మాత్రం వీఐపీ ప్రయాణాలకు హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ కావాల్సి వచ్చాయని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నారని ఆరోపించారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande