హుజురాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
యూరియా కోసం కష్టాలు హుజురాబాద్ ప్రాంతంలోని రైతుల అంతులేకుండా పోతున్నాయి. గత వారం రోజులుగా యూరియా సరఫరా లేకపోవడంతో ఆగ్రహించిన వివిధ గ్రామాల రైతులు, వ్యవసాయ అధికారి (ఏవో) కార్యాలయం ముందు బుధవారం ఆందోళన చేశారు. కార్యాలయానికి వచ్చిన ఏవో భూమ్ రెడ్డిని అడ్డుకుని, యూరియా సరఫరా ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు. రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కుతూ, పీఏసీఎస్ సంఘాలు, ప్రైవేట్ ఫర్టిలైజర్ యజమానులు యూరియాను బ్లాక్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వచ్చిన స్టాక్లో కొంత భాగాన్ని మాత్రమే పంపిణీ చేసి, మిగతాది బ్లాక్ చేసి అక్రమంగా అధిక ధరలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు