నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
గుంటూరు, 3 సెప్టెంబర్ (హి.స.): ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్‌ఆర్
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ


గుంటూరు, 3 సెప్టెంబర్ (హి.స.): ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఏ.ఎస్. రామకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుమారు 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, కానీ సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షల సరళి, సిలబస్‌పై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ చేపట్టినట్టు ఆయన వివరించారు. మన యువత ప్రధానంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాల మీదే దృష్టిపెడుతున్నారని, కానీ కేంద్రంలో డిఫెన్స్, బ్యాంకింగ్, రెవెన్యూ, సాంకేతిక రంగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande